Radio Ala 90.8

News Details

సూపర్ బజార్ చైర్మన్ గా గోవింద్

సూపర్ బజార్ చైర్మన్ గా ముమ్మిడి గోవిందు ఎన్నికయ్యారు. సోమవారం సూపర్ బజార్ ఆవరణలో జరిగిన ఎన్నికల్లో ఆయనను ఎన్నుకున్నారు. కాకినాడ రిటైల్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుని గా 25 సంవత్సరాలు సేవలందించిన ముమ్మిడి గోవిందు 30ఏళ్ళు గా కాకినాడ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి గా వ్యవహరిస్తున్నారు. జ్యోతుల సీతారామ మూర్తి చైర్మన్ గా ఉన్న సమయం లో ఆయన 24వ డివిజన్ మున్సిపల్ కౌన్సిలర్ గా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ ముమ్మిడి గోవిందు మాట్లాడుతూ సూపర్ బజార్ ను లాభాల బాట లో పయనించేలా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ అవకాశం ఇచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీత SRMT అధినేత సారధి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a reply