Radio Ala 90.8

News Details

జియో డిజిటల్ లైఫ్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ ఐఎల్ ) తన డిజిటల్ సేవలన్నింటినీ ఒకే గూటికి చేర్చనుంది. జియో సహా డిజిటల్ విభాగాలన్నింటితో కలిపి పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ పరిణామం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ సేవల సంస్థ అవతరించేందుకు దోహదం చేస్తుందని ఆర్ ఐఎల్ పేర్కొంది. పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ఏర్పాటు ప్రతిపాదనకు ఆర్ ఐఎల్ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. రిలయన్స్ జియోతో పాటు ఇతర డిజిటల్ ఫ్లాట్ ఫాంలు అందిస్తున్న సేవల ద్వారా దేశ డిజిటల్ సేవల వ్యవస్థ ముఖచిత్రాన్ని ఆర్ ఐఎల్ మార్చేసిన సంగతి తెలిసిందే.

Leave a reply