Radio Ala 90.8

News Details

ఇసుక సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహం స్పూర్తితో ఇసుక సత్యాగ్రహం ::::::::::::::::::సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు :::::::::::::కాకినాడలో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి కేకలు :::::::::::::;;వినూత్నంగాతిండిలేకఆత్మహత్య శరణ్యం అంటూ ఉరి వేసుకుని నిరసన :::::;;;;;;;;నాలుగు నెలలకు ఉపాధి లేక గంజి గతి అంటూ చిప్పలతో ప్రదర్శన ::::::::::;;:::::::;పవన్ కళ్యాణ్ ఇసుక సమస్యపై చేపట్టిన లాంగ్ మార్చ్ సిపిఐ సంఘీభావం :::::::::::::::కాకినాడ ,నవంబర్ 1 :గత ఐదు నెలలుగా ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు అదేవిధంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు 20 వేల రూపాయలు ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికులు వందలాది మంది శుక్రవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆకలి కేకలు నిర్వహించారు .ఉరి వేసుకుని ఇసుక ఇవ్వకపోతే మా ఆత్మహత్యలే శరణ్యమని వారు డిమాండ్ చేశారు .అర్ద ఆకలితో అలమటిస్తున్నామని వందలాది మంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తుంటే నిమ్మకునీరెత్తినట్లు వ్యవరించిన జగన్ ప్రభుత్వం నేడు ఇసుక వారోత్సవాలు చెప్పడం సిగ్గుచేటని ఆయన అన్నారు .అయినా మేము అయన ప్రకటనను స్వాగతిస్తామని వారం రోజుల్లో ఇసుక ఈ సమస్య పరిష్కారం చేయకపోతే గాంధీజీ గారి స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు ఉప్పుసత్యాగ్రహం ఎలాగైతే మొదలుపెట్టారో నేడు ఆంధ్రప్రదేశ్లో ఆ స్పూర్తితో ఇసుక సత్యాగ్రహం అమలు చేస్తామని ఆయన తెలియజేశారు .అవసరమైతే వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక రీచ్ కి వెళ్లి ఉచితంగా మేమె కార్మిక సంఘాలు ను కలుపుకుని అందరం ఉచితంగా పంపిణీ చేస్తామని ఆయన తెలియజేశారు .ఈ జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే కార్మిక సంఘాలు భవన నిర్మాణ కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకుని రాష్ట్ర బందును కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు .నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు పొట్ట చేత్తోపట్టుకుని ఉంటున్నారని తూర్పుగోదావరి జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు పనులు లేక వలసలు పోవడం సిగ్గుచేటన్నారు .ఇంతక ముందు ఒక రాయలసీమ ఉత్తరాంధ్ర కే పరిమితమైన వలసలు తూర్పుగోదావరి నుంచి కూడా జరగడం అంటే చాలా అనాగరిక చర్య అని ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన కోరారు .ఇప్పటివరకు చనిపోయిన భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా నాలుగు నెలలుగా ఉపాధి పోయిన భవన నిర్మాణ కార్మికులు కు వారికి ఆకలి భృతి 20 వేల రూపాయలు ఇవ్వాలని వారు రామకృష్ణ డిమాండ్ చేశారు. దీని మీద అవసరమైతే వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన తెలియజేశారు .మంత్రులు వరదల వల్ల ఇసుక కొరత ఉందని చెప్పడం చాలా హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు .ఎందుకంటే వరదలు అనేది దేశవ్యాప్తంగా వచ్చాయని మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఉన్నాయని అక్కడ ఎందుకు ఇసుక సమస్య రాలేదని ఆయన ప్రశ్నించారు.ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని ఇది సిపిఐ సూస్తు ఊరుకోదని తాడో పేడో తేల్చు కుంటామని అన్నారు .ఇంకా ఆకలి కేకలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య ,జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ,పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నల్లరామారావు ,నక్క కిషోర్ ,తోకల ప్రసాద్ ,కె .సతిబాబు ,టి .అన్నవరం ,నక్క శ్రీనివాస్రావు ,లోవరత్నం ,రాము ,psnarayanaశివకోటి రాజు ,భవన్ నిర్మాణానాయకులు త్రిమూర్తులు ,శీలం వెంకటేష్ ,పెంటకోట సత్తిబాబు ,దురంపూడి రాజు,అప్పలరాజు వీరమణి ,aiyf జిల్లా ప్రధాన కార్యదర్శి వై .బాబీ ,aisf జాన్ ప్రకాష్ దీనికి సగర సంఘము జిల్లా కమిర్తి తరుపున పెద్దలు ,కార్మికులు ఆదిగా సంక్యలో పాల్గున్నారు .

Leave a reply