Radio Ala 90.8

News Details

అన్నవరంలో గిరి ప్రదక్షిణ

అన్నవరంలో ఘనంగా గిరి ప్రదక్షిణ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీకమాస కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. తొలి పావంచాల వద్దనుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ లో లో పాల్గొన్న డానికి వేలాది మంది భక్తులు పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ లో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా పెద్దాపురం డిఎస్పి శ్రీనివాస రావు నేతృత్వంలో పోలీసులు అన్నవరం లో కి ట్రాఫిక్ ను రాకుండా బైపాస్ మీదుగా తరలించారు. గిరి ప్రదక్షిణ లో కాకినాడ ఎంపీ వంగా గీత, ప్రతిపాడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ఈ.ఓ. వేండ్ర త్రినాథరావు, చైర్మన్ రాజాఐవి రోహిత్ పాల్గొన్నారు.

Leave a reply