Radio Ala 90.8

News Details

వలస కార్మికులు తరలింపునకు కసరత్తు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వలస కార్మికుల సంఖ్యను తేల్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 1,883 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో షెల్టర్లలో ఉన్నవారు 567 మంది, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు 791 మంది, అసంఘటిత రంగ కార్మికులు 525 మంది ఉన్నారు. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఘండ్‌, పుదుచ్చేరి, ఒడిశా, సిక్కిం, దిల్లీ, పశ్చిమబంగ రాష్ట్రాలకు చెందిన వారు. వీరిలో 576 మంది ఉత్తర్‌ప్రదేశ్‌, 370 మంది ఒడిశా, 270 మంది పశ్చిమబంగ, 160 మంది జార్ఘండ్‌కు చెందిన వారు ఉన్నారు.

Leave a reply