Radio Ala 90.8

News Details

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైన సేవలు

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో సోమవారం నుంచి పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రి ని కొవిడ్‌-19 జిల్లా ఆసుపత్రిగా వినియోగిస్తున్నందున ఇప్పటివరకు సాధారణ ఓపీ, ఐపీ సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల నుంచి సాధారణ వైద్యసేవలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. సోమవారం నుంచి ఎప్పటిలాగే అన్ని విభాగాలు ఓపీ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సోమసుందరరావు తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో శనివారం 22 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు.

Leave a reply