Radio Ala 90.8

News Details

పోలవరం ముంపు బాధితులకు తీపి కబురు

పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న నిర్వాసితులందరికీ యుద్ధప్రాతిపదికన పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. పునరావాస కాలనీలు నిర్మిస్తున్న కార్యనిర్వాహక ఏజెన్సీలు, ఇంజినీర్లు, గుత్తేదారులతో కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్ లక్షీశ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... నిర్వాసిత కుటుంబాలకు కాలనీలు నిర్మించేందుకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు నిధులు విడుదలయ్యాయన్నారు. కాంట్రాక్టర్ లకు బిల్లులను చెల్లిస్తామని చెప్పారు. గతేడాది గోదావరి వరదల వల్ల ముంపునకు గురైన గ్రామాల్లోని నిర్వాసితులకు తొలుత గృహాలను పూర్తిచేసి అప్పగించాలని అధికార్లను ఆదేశించారు కలెక్టర్.

Leave a reply