Radio Ala 90.8

News Details

కరోనా వారియర్స్ కు శాల్యూట్ : చిరంజీవి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కట్టడిపై పోరాటం చేస్తున్న కరోనా యోధులకు సంఘీభావంగా వారిపై గగనతలం నుంచి పూల వర్షం కురిపించడం అభినందనీయం అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆదివారం ఆయన ట్వీటర్‌ వేదికగా వైద్యులు, సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కి పుష్పాభివందనం చేయడం అభినందనీయం. మీ అందరికీ మేమంతా రుణపడి ఉన్నాం. జై హింద్‌’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Leave a reply