Radio Ala 90.8

News Details

థర్మాకోల్‌, పరిశ్రమలో, భారీ, అగ్నిప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులోని లక్ష్మీ సమన్విత పాలిమర్ (థర్మాకోల్) పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న‌ తాడేపల్లిగూడెం, భీమడోలు అగ్నిమాపకశకటాలు సంఘటనాస్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశాయి. ఆస్తి నష్టం రూ. కోట్లలో ఉంటుందని అధికారులుఅంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలోకార్మికులెవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave a reply