Radio Ala 90.8

News Details

మద్యం దుకాణాల డ్యూటీ పై పవర్ స్డార్ ఫైర్‌

భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులకు మద్యం దుకాణాలవద్ద విధులు నిర్వహించాలని ఆదేశిమనచడంపై జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై మండిపడ్డారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం ఆయా దుకాణాల వద్ద ఉపాధ్యాయులను ఉంచడం శోచనీయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులకు ఇవేం విధులని ప్రశ్నించారు. మంగళవారం ఆయన చిత్తూరు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకో, పేదలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం వంటి వాటిని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులు ఉపయోగించుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆలయాలు, మసీదులు, చర్చీలకు వెళ్లకుండా.. పండుగలు చేసుకోకుండా నియబద్ధంగా ఉంటే.. ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు తెరవడం ద్వారా ఇంతకాలం పాటించిన లాక్ డౌన్ నియమాలను, ఆ స్ఫూర్తిని మంటగలిపిందని పవన్‌ వ్యాఖ్యానించారు.

Leave a reply