Radio Ala 90.8

News Details

ఇద్దరు కరోనా పేషెంట్ లు డిశ్ఛార్జ్

తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. 22 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని ప్రభుత్వం విడుదలచేసిన హెల్త్‌ బులెటెన్‌లో పేర్కొంది. జీఎస్‌ఎల్‌ వైద్యశాల నుంచి రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటకు చెందిన 22ఏళ్ల వ్యక్తి, కాకినాడలోని జీజీహెచ్‌ నుంచి పిఠాపురం పట్టణంలోని తారకరామ నగర్‌కు చెందిన 38ఏళ్ల వ్యక్తి డిశ్చార్జి అయినవారిలో ఉన్నారు. ప్రస్తుతం జీఎస్‌ఎల్‌లో 15 పాజిటివ్‌ కేసులు చికిత్స పొందుతుండగా.. మిగిలిన కేసులకు విశాఖ జిల్లాలోని విమ్స్‌లో వైద్యసేవలు అందిస్తున్నారు.

Leave a reply