Radio Ala 90.8

News Details

ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పీఎంపీ సేవలను అనుమతించాలి :పీఎంపీ సంఘం వినతి.

లాక్ డౌన్ సమయంలో గ్రామీణ ప్రాధమిక వైద్యులు (పిఎంపీ )తమ వృత్తిని మూసివేసి ఇంటికే పరిమితమైన కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందని, జిల్లాలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినందున ప్రాధమిక వైద్య సేవలు అందించేందుకు తమకు అనుమతులు ఇవ్వాలని పిఎంపీ అసోసియేషన్ కాకినాడ శాఖ కోరింది. ఈమేరకు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు అసోసియేషన్ సభ్యులు కె. తాతారావు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తే గ్రామీణ ప్రజలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ, వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తామని, అలాగే దగ్గు, రొంప, జ్వరం వంటి లక్షణాలు గల వ్యక్తులు తమవద్దకు వచ్చినప్పుడు వలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తామని అన్నారు. పల్లెల్లోని ప్రజలు చిన్న చిన్న వైద్య సమస్యలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాధమిక వైద్యం ద్వారా వచ్చే సంపాదనతో కుటుంబ పోషణ చేసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆదాయం కోల్పోయి పిఎంపీలు కష్టాలు పడుతున్నారన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి పి.వి.సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a reply