Radio Ala 90.8

News Details

నిత్యావసరాల పంపిణీ

లాక్ డౌన్ సడలింపు ఇచ్చినప్పటికీ పలువురు సాధారణ ఉద్యోగులు, కూలీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి డి హెచ్ వి సాంబశివరావు బుధవారం పలువురికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం, నగదు పంపిణీ చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సులతో ఇకనుంచి నిత్యావసర వస్తువులు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిరుపేదలను ఆదుకునేందుకు ఆర్ బి ఎఫ్ మండలాల వారీగా ఈ కార్యక్రమం చేపడుతోందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చాగంటి పాటి అబ్బు, అల్లంరాజు బాబి, పెద్దింటి గోపాలకృష్ణ, భోగి రెడ్డి రాంబాబు, జిల్లెల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a reply