Radio Ala 90.8

News Details

బీహార్ వలస కూలీల కు స్థానికులు సాయం

లాక్ డౌన్ కారణంగా రాజమండ్రి, పెద్దాపురం పరిసరప్రాంతాలు నుండి సామర్లకోట మీదుగా తమ సొంత రాష్ట్రం బీహార్, మోతిహారి జిల్లా, హరే రాజ్ మండలం, పరకొండ హరి గ్రామానికి ప్రయాణమైన వలస కూలీలకు ఆహార వితరణ చేయడం జరిగిందని కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూరాకుల సింహాచలం తెలిపారు. మంగళవారం 30 మంది కాలినడకన పిఠాపురం మండలం జల్లూరు గ్రామానికి వచ్చిన వలస కూలీల కు జీసస్ గ్రేస్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు ముడుగు రాజేష్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు త్రాగునీరు, అందజేశారు, అలాగే మల్లం గ్రామం అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ ఎద్దు సుబ్రహ్మణ్యం వలస కార్మికులకు 600 రూపాయలు నగదు అందజేశారు

Leave a reply