Radio Ala 90.8

News Details

చిరుత సంచారం అంటూ భయాందోళన

మండల పతిధిలోని పెద్దాపురప్పాడు దుర్గమ్మ గుడి నుంచి తర్లంపూడి వెళ్లే రోడ్డులో ఈ ఘటన జరిగింది. వై. సావారం కల్లు గీత కార్మికుడు గంగరాజు కు చెందిన దూడలను పులిగా అనుమానిస్తున్న జంతువు చంపినట్టు తెలిసింది. ఆ జంతువు అడుగు ముద్రలు సమీపంలో ని చెరువు వద్ద కనిపించాయి. పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు విచారణ జరుపుతున్నారు.అటవీశాఖ కాకినాడ చెకింగ్ ఆఫీసర్ కె వి ఎస్ ప్రసాద్, బీట్ ఆఫీసర్ ఎస్. సురేష్ కుమార్ లు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఆ జంతువు పాద ముద్రలు సేకరించి వైల్డ్ లైఫ్ ఆఫీసర్ కి పంపించారు.

Leave a reply