Radio Ala 90.8

News Details

వానరాలకు విందు

ఆహారం లేక అలమటిస్తున్న వానరాలని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ ఆదుకుంటుంది. గత కొద్ది రోజులుగా వీటికి ఆహారం అందజేస్తోంది. కాకినాడ.. యానం రోడ్డులో కోరంగి వంతెన వద్ద వందకు పైగా వానరాలు నివసిస్తున్నాయి. తరచూ పెడుతున్న ఆహారంలో భాగంగా గురువారం వీటికి ఫ్రంట్ తరఫున విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఏడు రకాల ఆహార పదార్థాలతో వాటికి ఆహారం సమకూర్చి వాటి ఆకలి తీర్చడం జరిగింది. ఈ నెల 17వ తేదీన హనుమద్ వ్రతం సందర్భంగా ఇక్కడ ఉన్న వానరాలకు భారీ విందు ఏర్పాటు చేస్తామని సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డాది సత్తిబాబు, అల్లంరాజు బాబీ, జిల్లెల్ల ప్రసాద్, చీర్ల శ్రీనుబాబు ,కే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a reply