Radio Ala 90.8

News Details

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. కాకినాడ సిటీ ఎమ్మెల్యే

ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు నిబంధనలు పాటించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులు తో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణ కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు ఆయన మాట్లాడుతూ, మార్కెట్ హోల్ సేల్ దుకాణం వద్ద దుఖానాదారులు రహదారిపై దుఖానాలు ఏర్పాటు చేయరాదని సూచించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని చెప్పారు. వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్‌ చేయరాదని తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తున్నామని, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.కరోనా లాక్ డౌన్ నేపద్యంలో ప్రజలు అధికారుల సహకారంతో కాకినాడ గ్రీన్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు మరో 15 రోజుల పాటు ప్రతి ఒక్కరు లౌక్ డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు

Leave a reply