Radio Ala 90.8

News Details

*ఉత్సాహంగా కొనసాగుతున్న అంబలి, సహతా కేంద్రం

రైతు సంఘం జిల్లా కమిటి, సిఐటియు కాకినాడ నగర కమిటి, ధర్మవరం గ్రామ ప్రజల సహకారంతో నడుస్తున్న వలస కార్మికుల కోసం ప్రారంభించిన అంబలి, సహాతా కేంద్రం విజయవంతంగా కొనసాగుతుంది. ఎన్ హెచ్ 5 పై ధర్మవరం గ్రామ వద్ద నెలకొల్పిన సహతా కేంద్రంలో అంబలి, మజ్జిగ, బ్రెడ్, పాలు, మంచి నీరు, అరటి పండ్లు పంపణీ చేశారు. ఇతర రాష్ట్రాల వలస కార్మికులు ఈ శిభిరం వద్ద సేద తీరి, ఆహారం తిని మరిన్ని పట్టుకూ వెళ్తున్నారు. సహతా కార్యక్రమానికి ప్రతిభా విద్యాలయ అధినేత శేషారావు, విశ్రాంత రైల్వే డివిజనల్ ఇంజనీర్ సిద్ధపురెడ్డి తాతారావు(రైతు), పూర్వ సర్పంచ్ పుణ్యమంతుల రామరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వెంకటేష్ ,ధర్మవరం గ్రామ ప్రజలు నాయకత్వం వహిస్తున్నారు.

Leave a reply