Radio Ala 90.8

News Details

ఉప్పాడలో ఎగసిపడుతున్న కెరటాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను కారణంగా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి.మంగళవారం ఉదయం నుంచి ఉప్పాడ సముద్రతీరం అల్ల కల్లోలంగా మారింది. రంగంపేట నుంచి ఎస్పీ జిఎల్ శివారు వరకు సముద్ర అలలు పోటెత్తుతున్నాయి. సముద్రపు అలలు వాహనదారులపై విరుచుకుపడుతున్నాయి. దీంతో కాకినాడ ఉప్పాడ ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు.నీటి మట్టం పెరగడం, వాతావరణంలో మార్పు రావడంతో సముద్రం అలలు మరింత పెరిగే అవకాశాలు ఉండవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు.సముద్రం పక్కన ఉన్న బోట్లు,వలలు భద్రపరచుకునే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు.

Leave a reply