Radio Ala 90.8

News Details

కాకినాడ కమిషనర్ గా సునీల్ కుమార్ రెడ్డి

కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ గా ఐఎఫ్ఎస్ అధికారి బి.సునీల్ కుమార్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను కాకినాడ కమిషనర్ గా నియమించారు. ప్రస్తుతం చిత్తూరు పశ్చిమ జిల్లా అటవీ అధికారి గా పనిచేస్తున్నారు. ఇటీవల కాకినాడ కమిషనర్ గా కర్నూలు కమిషనర్ రవీంద్రబాబు ను నియమించినా ఆయన ఇప్పటివరకు విధులలో చేరకపోవడంతోఆయన నియామక ఉత్తర్వులు రద్దుచేశారు.ప్రస్తుత కమిషనర్ కె.రమేష్ విశాఖపట్నం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ గా వెడుతున్నారు. కొత్త కమిషనర్ రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారని అధికార వర్గాలు చెపుతున్నారు.

Leave a reply