Radio Ala 90.8

News Details

ఆపదలో అలుపెరగని సేవలు

కరోనా నియంత్రణలో వైద్యులు, సిబ్బంది కృషి అభినందనీయమని బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తెలిపారు శుక్రవారం కాకినాడ జిజి హెచ్ లో కరోనా నేపథ్యంలో వైద్యులు సిబ్బంది చేసిన సేవలకు మరువలేమని జిజి హెచ్ సూపర్డెంట్ డా. రాఘవేంద్రరావు ను సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులకు వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, అంబులెన్స్‌ సిబ్బంది నిరుపమాన సేవలు అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వారు త్వరగా కోలుకుని తిరిగి ఇంటికి వెళ్లేలా కృషి చేస్తున్నారు. పాజిటివ్‌ ఉందని తెలిసినా భయపడకుండా బాధితుల నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కరోనా నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు. మహమ్మారిని కట్టడిలో సేవలు, స్వీయ జాగ్రత్తలు, బాధితులకు అండగా ఉంటూ కరోనాపై వీరు పోరాటం చేస్తున్నారన్నారు

Leave a reply