Radio Ala 90.8

News Details

అన్ని రాష్ట్రాల అభివృద్ధికోసంకేంద్రం ప్యాకేజీ

కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందించేందుకు కేంద్రం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం అభినందనీయమని భాజపా నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం బిజెపి నాయకులు గట్టి సత్యనారాయణ నివాసంలో బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే.. రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి హామీ నిధుల పెంపు, రైతు సంక్షేమం, ఆరోగ్య భద్రత, బీమా సౌకర్యం ఇలా అన్ని వర్గాలకు స్వావలంబన కలిగించే దిశగా కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు పలువురు నాయకులు కేంద్ర ప్యాకేజీపై విమర్శించడం తగదన్నారు

Leave a reply