Radio Ala 90.8

News Details

42 వేల కోట్ల రూపాయల నిధులతో సంక్షేమ పథకాలు అమలు.. ఉప ముఖ్యమంత్రి

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఈ సంవత్సర కాలంలో 42 వేల కోట్ల రూపాయల నిధులతో వివిధ పథకాల కింద ఖర్చు పెట్టినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు . మన పాలన - మీ సూచన భాగంగా సోమవారం మధ్యాహ్నం వివేకానంద సమావేశపు మందిరంలో మేదో మధన సదస్సులో ముఖ్య అతిధి గా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 27 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జూలై మాసంలో జరుగుటకు చర్యలు తీసుకును చున్నట్లు తెలియజేసారు . రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం హాయాం లో చేసిన బాకీలు , వడ్డీలు చెల్లించడంతో పాటు సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలియజేసారు . ఈ మేదో మధన సదస్సులో స్వచ్ఛంధ సంస్థల వారు , గ్రామ వాలంటీర్లు , అధికారులు పధకాలు మరింత వేగంగా అర్హులందరికి అందే విధంగా సలహాలు , సూచనలు ఇవ్వాలన్నారు . ఈ సలహాలు , సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు . జాయింట్ కలక్టర్ ( డి ) శ్రీమతి కీర్తి చేకూరి మాట్లాడుతూ గ్రామ , సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పవని , వాటిని మరింత బలో పేతం చేసి ప్రజలకు దగ్గర కావడానికి సూచనలు , సలహాలు ఇవ్వాలన్నారు . గ్రామ వాలంటీర్లు , సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు వారి వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు . జాయింట్ కలక్టర్ ( డబ్ల్యూ ) జి.రాజకుమారి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు పట్టిష్టవంతంగా అములు చేయాలంటే ముందుగా గ్రామ సచివాలయాల సిబ్బందికి , వాలంటీర్లకు ఆ పధకాలపై అవగాహన ఉండాలన్నారు . వాలంటీర్లకు గ్రామ సచివాలయాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆమె అన్నారు . ఏ ఒక్క అర్హత ఉన్న లబ్ధిదారుడు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత గ్రామ , సచివాలయం మరియు వాలంటీర్ల పై ఉన్నదని అన్నారు . జిల్లా పరిషత్ ముఖ్యకార నిర్వాహణాధికారి శ్రీమతి ఎమ్.జ్యోతి మాట్లాడుతూ ఈ సదస్సులో తీసుకున్న సలహాలను , సూచనలను రికార్డు చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు . ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు , స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సూర్యప్రసాద్ , జిల్లా అధికారులుతో పాటు వాలంటీర్లు , గ్రామ సచివాలయాల సిబ్బంది పధకాలు అమలులో తగు సూచనలు ఇచ్చారు .

Leave a reply