Radio Ala 90.8

News Details

ఖాళీ స్థలాల కు నోటీసులు ..

కాకినాడ స్మార్ట్ సిటీ లో ఖాళీ స్థలాలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్విప్నిల్ దిన్ కర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాకినాడ నగరంలో సోమవారం 5 6 7 డివిజన్ లలో ఆకస్మిక తనిఖీ చేశారు ఇంటికి ఇంటికి మధ్య ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం ఉండడాన్ని గమనించి శానిటరీ ఇన్స్పెక్టర్ పై అగ్రహారం చేశారు కాలవలు పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో మూడు వేల పైగా ఖాళీ స్థలాలు ఉన్నాయని ఆ స్థలాల్లో చెత్తాచెదారం పెరగడం వల్ల అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు తక్షణమే ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు ఖాళీ స్థలాల యజమానులు నోటీసులకు స్పందించకపోతే కార్పొరేషన్ ఖర్చులతో ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసి ఖర్చులను ఖాళీ స్థలాల యజమాని నుంచి వసూలు చేయాలని సూచించారు రానున్న వర్షాకాలం ,కరోనా దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు అనంతరం దుమ్ములపేట వద్ద స్మార్ట్ సిటీ నిధులతో చేపడుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు బ్రిడ్జి పనులను నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని కమిషనర్ తెలిపారు బోట్ క్లబ్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఈ పార్కును ఇతర పార్కులకు కన్నా భిన్నంగా ఉండేవిధంగా ప్రజలకు అన్ని సౌకర్యాలతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు స్మార్ట్ సిటీ నిధులతో వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయాలని తెలిపారు కమిషనర్ వెంట కార్పొరేషన్ ఎస్ ఇ సత్యనారాయణరాజు డాక్టర్ ప్రశాంత్ స్మార్ట్ అధికారులు పాల్గొన్నారు

Leave a reply