Radio Ala 90.8

News Details

డిఎంహెచ్ఓగా డా.మల్లిఖార్జున్ బాధ్యతలు స్వీకరణ

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డా.ఎమ్.మల్లిఖార్జున్ బాధ్యతలను సోమవారం స్వీకరించారు. ఇప్పటివరకు డిఎం హెచ్ఓ గా పనిచేసిన డా.బి.సత్యసుశీల పదవీవిరమణ చేయడంతో,డిఐవో పనిచేస్తున్న డా.మల్లిఖార్జున్ ను ఇంచార్జ్ గా నియమిస్తూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు స్వీకరించిన డా.మల్లిఖార్జున్ ను పలువురు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛాలు తో అభినందించారు. ఈసందర్భంగా డా.మల్లిక్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా నోడల్ అధికారిగా వైరస్ నియంత్రణకు కృషి చేయడం జరుగుతోందని, అలాగే జిల్లా వైద్య అధికారిగా ప్రజల ఆరోగ్యం కొరకు అందరిసహకారంతో కృషి చేస్తానని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు.

Leave a reply