Radio Ala 90.8

News Details

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మంగళవారం కరప సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలో జరుగుతున్న నాడు-నేడు పనులు పరిశీలించే నిమిత్తం మంగళవారం కలెక్టరేట్ నుంచి బయలుదేరిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి నేరుగా కరప గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయ సిబ్బంది హాజరు తనిఖీ చేశారు. సచివాలయంలో ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు.. కొత్తగా పింఛన్లు మంజూరు కోసం సచివాలయంలోనే దరఖాస్తులు స్వీకరించి అప్లోడ్ చేసే సాఫ్ట్ వేర్ వచ్చిందని కలెక్టర్ వివరించారు. ఇకనుంచి పింఛన్ల దరఖాస్తులు సచివాలయంలోనే సేకరించాలని ఆదేశించారు. అయితే సచివాలయానికి ప్రజాలిచ్చిన అర్జీలు, వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మేజర్ పంచాయతీలో ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయoటే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయం లో ఎన్ని రకాల సేవలు అందచేస్తారు, ఏ రకమైన సేవ ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది తదితర పూర్తి వివరాలు పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వాలంటీర్ల పనితీరును పరిశీలించారు. అయితే సచివాలయ పనితీరు పైనే ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. గ్రామంలో కరోనా గురించి అడిగి తెలుసుకున్నారు .పర్యటనలో తాసిల్దార్ చింతలపల్లి ఉదయభాస్కర్, మండల పంచాయతీ విస్తరణాధికారి చీకట్ల బాలాజీ వెంకట రమణ, గ్రామ రెవిన్యూ అధికారి భద్రిరాజు చండీ, కార్యదర్శి గొలకోటి త్రినాథరావు, మండల పౌరసరఫరాల అధికారి పి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a reply