Radio Ala 90.8

News Details

జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం..జిల్లా కలెక్టర్

కోవిడ్19 నేపథ్యంలో రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిఅన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కు బిస్వభూషన్ హరి చందన బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుని హోదాలో జిల్లా కలక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో కరోన వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెడ్ క్లాస్ ద్వారా చేపట్టిన కార్యక్రమాల పై సమీక్షించారు . ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ సమయాలలో కూడా తూర్పు గోదావరి జిల్లాలో రెక్త నిల్వ తగ్గకుండా చూసినందుకు తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీని అభినందించారు , జిల్లా కలక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలక్టర్ మరియు జిల్లా రెడ్ క్లాస్ సంస్థ ప్రెసిడెంట్ డి.మురళీధర్ రెడ్డి , రె క్లాస్ అధికారులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలక్టర్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా , రెడ్ క్రాస్ సొసైటీ కోవిడ్ -19 పై అవగాహన కార్యక్రమాలు మార్చి 20 వతేదీ నుండి ప్రాంభించినట్లు తెలియజేశారు . అదే విధంగా మార్చి 25 వ తేదీ నుండి రెడ్ క్రాస్ సంస్థ అవసరమైన వారికి ఆహార పొట్లాలు సరఫరా చేయడం జరిగిందన్నారు . తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు ఈ కార్యక్రమాలకు తన వంతుగా ఆర్ధిక సహాయం ల రూపాయలు విరాళంగా అందించినట్లు కలక్టర్ తెలిపారు . గత 75 రోజుల నుండి రెడ్ క్రాస్ సొసైటీ అవసరమైన వారికి ఆహార పొట్లాలు , రొట్టెలు , పళ్ళు , మజ్జిగ , వాటర్ ప్యాకెట్లతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేసినట్లు తెలిపారు . ప్రస్తుతం జిల్లాలో రెడ్ క్లాస్ సర్వీస్ కౌంటర్ ప్రత్తిపాడు నేషనల్ హైవే -16 వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . అదే విధంగా కాకినాడ ముఖ్య ప్రాంతాలలో కళన పై అవగాహన నిమిత్తం పెయింటింగ్ లు ఏర్పాటు చేసి కోవిడ్ -19 పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు . అదే విధంగా చేతుల పరిశుభ్రత , బౌతిక దూరం , ఇళ్ళలోనే క్షేమంగా ఉండండి అనే నినాదంతో ప్రజలను చైతన్య పర్చుచున్నట్లు తెలియజేశారు . జిల్లాలో రెడ్ క్లాస్ సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ , రామకృష్ణ సేవా సమితి సహకారంతో 10 లక్షల రూపాయలు విలువ కలిగిన నిత్యావసర సరకులను పారిశుధ్య కార్మికులకు , వలస కార్మికులకు , రివా కార్మికులకు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు . జిల్లాలో రెడ్ కాస్ సొసైటీ గం 75 రోజుల నుండి 200 నుండి 300 యూనిట్లు బ్లెడ్ నిల్వ ఉండేలా చూడడం జరిగిందన్నారు . అదే విధంగా తలసీమియా వ్యాధి గ్రస్తులకు 227 బ్లెడ్ యూనిట్లను గత 75 రోజుల కాలంలో ఉచితంగా రక్తం ఎక్కించిట్లు తెలియజేశారు . అదే విధంగా 1393 యూనిట్ల బ్లెడ్ ను వాకింగ్ మరియు వాలెంటరీ బ్లెడ్ డొనేషన్ ద్వారా సేకరించినట్లు తెలిపారు . రెడ్ క్రాస్ సొసైటీకి ఇయిర్ కండిషన్ బ్లెడ్ డొనేషన్ బస్సు ఉండడం వలన జిల్లా నలుమూలలు వెళ్ళి దాతల నుండి 1557 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు . అదే విధంగా జిల్లాలో 365 మంది హెల్త్ వర్కర్లకు గత 75 రోజులలో కోవిడ్ పై అవగాహనే , ఫస్ట్ ఎయిడ్ పై శిణ ఇచ్చినట్లు తెలిపారు . ఈ శిక్షణ పొందిన వారిని ప్రభుత్వ ఎమర్జెన్సీ హెల్త్ రిక్రూట్ మెంట్ లో అవకాశం కల్పించినట్లు తెలిపారు . జిల్లాలో కోవిడ్ కారణంగా అన్ని ప్రైవేట్ హాస్పిటల్ లలో ఓపి సివలు నిలిపి వేసినా రెడ్ క్లాస్ హాస్పిటల్ లో మాత్రం ప్రజలకు ఓపి సేవలు అందించడంతో పాటు ఉచిత మందులు అందించడం జరిగిందన్నారు . అంటులెన్స్ సర్వీసులు , ఆత్మ బంధు సేవలు కోవిడ్ సమయాలలో ఎటువంటి అంతరాయం కలుగ కుండా సేవలు అందించినట్లు ఆయన తెలియజేశారు . తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వై.డి.రామారావు మాట్లాడుతూ జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి కోవిడ్ సమయాలలో ముందస్తుగా రక్తదానం చేసి చాలా మందికి ఆదర్శప్రాయుడయ్యారన్నారు . రెడ్ క్లాస్ సంస్థ కోవిడ్ సమయంలో తన వంతు బాధ్యతను నిర్వహించుచున్నట్లు తెలియజేశారు . వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ కె.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .

Leave a reply