Radio Ala 90.8

News Details

మోహన్‌బాబుపై వస్తున్న వార్తల్లో నిజం లేదు

ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా తనను నియమించారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ప్రముఖ న‌టుడు, నిర్మాత‌, శ్రీవిద్యానికేత‌న్ సంస్థల అధినేత డా.మంచు మోహ‌న్‌బాబు ఖండించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నన్ను నియమించారని వస్తున్న వార్తల్లో నిజంలేదు. అలాంటి వార్తలను నమ్మకండి. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తాం’ అని మోహన్‌బాబు ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a reply