Radio Ala 90.8

News Details

కార్పొరేషన్ కార్యాలయం అపరిశుభ్రంగా ఉంటే సహించేదిలేదు..కమిషనర్

కాకినాడ కార్పొరేషన్ లో అ న్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండాలని, అపరిశుభ్రంగా ఉంటే సహించేదిలేదని కమిషనర్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ప్రతి శనివారం శుభ్రత కార్యక్రమంలో భాగంగా శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో పరిసరాల పరిశుభ్రత చేశారు ఈ సందర్భంగా కమిషనర్ దినకర్ పుండ్కర్ మా ట్లాడుతూ కార్పొరేషన్ లో ప్రతి విభాగంలో ఉన్న ఎప్పుడూ కిటికీలు తీసి ఉండాలని, దుమ్ము, ధూళి లేకుండా చూడాలని, కా ర్యాలయానికి వచ్చే వాళ్లకు ఆహ్లాదకరమైన వాతావర ణం ఉండేలా కార్యాలయాలను శుభ్రంగా ఉంచాల న్నారు. అపరిశుభ్రత కనిపిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కార్యాలయాలను కూడా సొంత ఇంటిలా భావించాలన్నారు. మనం ఎక్కువ సమయాన్ని కార్యాలయంలోనే గడుపుతామని, అలాంటి కా ర్యాలయాన్ని, దాంతోపాటు నిర్వహించే ఫైళ్లను క్రమ పద్ధతిలో ఉంచాలన్నారు. ఈ కార్య క్రమంలో అదనపు కమిషనర్ నాగేశ్వరావు డాక్టర్ ప్రశాంత్ మేనేజర్ మురళితదితర అధికారులు పాల్గొన్నారు

Leave a reply