Radio Ala 90.8

News Details

జగన్ అవినీతిని ఎండ గట్టినందుకే అచ్చెన్ననాయుడుపై కక్ష సాధింపు వనమాడి కొండబాబు---

అచ్చెన్ననాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు అంబేద్కర్ భవన్ వద్ద పూలే విగ్రహామం నందు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ జగన్ అవినీతిని ఎండ గట్టినందుకే అచ్చెన్న నాయుడుపై కక్ష సాధింపు చేస్తున్నారని భార్యాబిడ్డలకు చెప్పకుండా అచ్చెన్న ఇంటిపై దాడి చేసి చట్టవిరుద్దంగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని వైసీపీ ప్రభుత్వం శాడిజం పరాకాష్టకు చేరిందని ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ఎదుర్కొలేకే ఇలాంటి దుర్మార్గాలకు తెగించారని, వైసిపి ఏడాది పాలనలో అవినీతి కుంభకోణాలు ఇసుక, మద్యం, గనులు, భారతీ పాలిమర్స్ నిధులు కేటాయింపు, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు, భూసేకరణలో స్కామ్లు అసెంబ్లీలో నిగ్గదీసితారని భయంతో అక్రమంగా అరెస్టు చేశారని రాజకీయంగా ఎదుర్కొలేక దొడ్డిదారని కక్ష సాధింపు చేపడుతున్నారని ఎర్రన్నాయుడి కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసేందుకే అక్రమంగా అరెస్టు చేశారని రాష్ట్రంలో పరిస్థితి దొంగే మిగతా వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రమణ, కర్రీ శ్రీనివాస్, MA తాజుద్దీన్, గదుల సాయిబాబా, వనమాడి ఉమాశంకర్, మల్లాడి గంగాథరం, అంబటి చిన్న, బంగారు సత్యనారాయణ, గుజ్జి బాబు, మల్లిపూడి వీరు, MD అజ్జు, పలివెల రవి, చింతలపూడి రవి, కొల్లాభక్తుల అప్పారావు, సికోటి అప్పలకొండ, ముగ్గుల బాబురావు, బలరాం, పసుపులేటి వెంకటేశ్వరరావు, గదుల వీరబాబు, మేడిశెట్టి చిన్ని, ఇరుపిల్లి రాము, MA ఖాన్, గుమ్మల చిన్న, గడ్డం పూర్ణ, కలిదిండి సురేష్, కోరుమిల్లి శేషు తదితరులు పాల్గొన్నారు.

Leave a reply