Radio Ala 90.8

News Details

దోషులను కఠినంగా శిక్షించాలి... ఐసిడిఎస్ పిడి

జిల్లాలోని సీతానగరం మండలం కొత్తూరు గ్రామం లో ఇటీవలపదిహేను రోజుల పసికందును అది కిరాతకంగా హత్య చేసిన కిరాతుల ను కఠినంగా శిక్షించాలని ఐసిడిఎస్ పిడి డి పుష్పమణి తెలిపారు ఐసిడిఎస్ కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టడం ఇంటిలో మహాలక్ష్మి పుట్టినట్టుగా భావించాలి అన్నారు సమాజంలో ఇంకా లింగ వివక్షత చూడడం దురదృష్టకరమన్నారు పిల్లల దేశ సంపదగా భావించి అతి భారంగా భావించే పిల్లలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అప్పగించాలని ఆమె కోరారు అలాంటి వారు దగ్గర్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు మహిళా పోలీసులు చైల్డ్ హెల్ప్ లైన్1098 కి సంప్రదించాలని ఆమె కోరారు

Leave a reply