Radio Ala 90.8

News Details

తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలి..కమిషనర్

తడి, పొడి చెత్తను వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు ప్రజలు అందివ్వాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్విన్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కాకినాడ లో వంద బిల్డింగ్ సెంటర్ లో ఇంటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు తడి పొడి చెత్త సేకరణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరే చేసినట్లయితే కీటకాల నుంచి సంరక్షణ పొందవచ్చన్నారు. లేనిపక్షంలో కీటకాలు ఎక్కువై ప్రజలు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు తడి, పొడి చెత్తను వేరు వేరుగా స్వీకరించాలని, అలా స్వీకరించిన చెత్త ద్వారా కరెంటును ఉత్పత్తి చేసుకోవాలని సూచించిందనీ అన్నారు.. ఆ సూచన మేరకు ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. చెత్త సేకరణలో ప్రజలంతా తమ సహకారాన్ని అందిస్తే తప్పక ఇది విజయవంతం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేసి ఇవ్వాలని స్థానికులకు సూచించారు. స్థానికులు కాలువలపై సిమ్మెంట్‌ మూతలను వేయించాలని కోరారుకమిషనర్ వెంట కార్పొరేషన్ అధికారులు సత్యనారాయణ రాజు ,డా.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

Leave a reply