Radio Ala 90.8

News Details

వైఎస్సార్‌కు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం

పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందరి హృదయాల్లో కొలువై ఉన్నారని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు బుధవారం స్థానిక బాలాజీ చెరువు సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు భారీ కేక్ కట్ చేసి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారుపాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఆయన అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఎవరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తానున్నానని భరోసా కల్పించేవారన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. ‘‘నవరత్నాలు’’ సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నవరత్న పథకాల అమలు ద్వారా ప్రజలకు సమక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అర్హులైన పేద వాళ్ళందరికీ పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు ఫ్రూటీ కుమార్ చంద్రకళ దీప్తి మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణు కార్పొరేటర్ లో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a reply