Radio Ala 90.8

News Details

మంచినీటి పైపులైన్ లకుమరమ్మతులకు చేపట్టాలి..కమిషనర్

కాకినాడ నగరంలో పలుచోట్ల మంచినీటి పైపులైన్లు లీక్ కావడం వల్ల మంచినీరు వృధాగా పోతుందని తక్షణమే మరమ్మతులను చేపట్టాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్విన్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశించారు బుధవారం కాకినాడ నగరంలో దుమ్ములపేట రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు అమృత నిధులతో చేపడుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షా కాలంలో అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పైప్ లైన్ లీక్ లు వలన పరిశుభ్రమైన నీరు ప్రజలకు అందకుండా ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో లీకులు ఉన్న పైప్ లైన్ మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు అమృత నిధులతో చేపడుతున్న డ్రైనేజీలు నాణ్యత నిర్మాణాలతో చేపట్టాలని కాంట్రాక్టర్లు సూచించారు కమిషనర్ వెంట కార్పొరేషన్ అధికారులు సత్యనారాయణ రాజు డాక్టర్ ప్రశాంత్ స్మార్ట్ సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a reply